Shree Lalitha Chalisa శ్రీ లలితా చాలీసా – Reciting Lalitha Chalisa is considered very auspicious for the worship of Goddess Lalitha.
To get happiness, peace and prosperity in life, worship Goddess Lalitha with full faith and devotion.
Shree Lalitha Chalisa శ్రీ లలితా చాలీసా
Image source : Quora
|| శ్రీ లలితా చాలీసా ||
లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం ||
హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం ||
పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి ||
శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి ||
నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు ||
కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు ||
శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగ రావమ్మా ||
మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి ||
పసిడి వెన్నెలా కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాత పూమాలలో పార్వతి దేవిగా వచ్చితివి ||
రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు ||
కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి ||
రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగ
రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు ||
ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రం చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా ||
మహామంత్రాధిదేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్ర్య బాధలు తొలిగించి మహదానందము కలిగించే ||
అర్తత్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మా ||
విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి ||
ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ ||
దక్షుని ఇంట జనియించి సతీదేవిగ చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ ||
శంఖు చక్రమును ధరియించి రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు ||
పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగ
చిరునవ్వులను చిందిస్తూ చెరకు గడను ధరయించితివి ||
పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే ||
సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి ||
మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ ||
సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి ||
మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి ||
చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే ||
అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం ||
అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా ||
నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు ||
రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి ||
అరుణారుణపు కాంతులలో అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి ||
గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి ||
పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి ||
కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ||
ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు ||
మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి ||
త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా ||
ఆశ్రితులందరు రారండి అమ్మరూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము ||
సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు ||
మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము ||
Video
Video source : YouTube
Video source : YouTube
Lalitha Chalisa Lyrics
|| Shree Lalitha Chalisa ||
lalitāmātā śaṁbhupriyā jagatiki mūlaṁ nīvammā
śrī bhuvanēśvari avatāraṁ jagamantaṭikī ādhāram ||
hērambuniki mātavugā hariharādulu sēvimpa
caṇḍunimuṇḍuni saṁhāraṁ cāmuṇḍēśvari avatāram ||
padmarēkula kāntulalō bālātripurasundarigā
haṁsavāhanārūḍhiṇigā vēdamātavai vaccitivi ||
śvētavastramu dhariyiñci akṣaramālanu paṭṭukōni
bhaktimārgamu cūpitivi jñānajyōtini nimpitivi ||
nitya annadānēśvarigā kāśīpuramuna kōluvuṇḍa
ādibikṣuvai vaccāḍu sākṣādāparamēśvaruḍu ||
kadambavana sañcāriṇigā kāmēśvaruni kalatramugā
kāmitārtha pradāyinigā kañci kāmākṣivaināvu ||
śrīcakrarāja nilayinigā śrīmat tripurasundarigā
siri sampadalu ivvammā śrīmahālakṣmiga rāvammā ||
maṇidvīpamuna kōluvuṇḍi mahākāli avatāramulō
mahiṣāsuruni campitivi mullōkālanu ēlitivi ||
(lalitāmātā śaṁbhupriyā jagatiki mūlaṁ nīvammā
śrī bhuvanēśvari avatāraṁ jagamantaṭikī ādhāraṁ)
pasiḍi vēnnēlā kāntulalō paṭṭuvastrapudhāraṇalō
pārijāta pūmālalō pārvati dēvigā vaccitivi ||
raktavastramu dhariyiñci raṇaraṅgamuna pravēśiñci
raktabījuni hatamārci ramyakapardinivaināvu ||
kārtikēyuniki mātavugā kātyāyinigā karuṇiñci
kaliyugamantā kāpāḍa kanakadurgavai vēlisitivi ||
rāmaliṅgēśvaru rāṇivigā ravikula sōmuni ramaṇiviga
ramāvāṇi sēvitagā rājarājēśvarivaināvu ||
khaḍgaṁ śūlaṁ dhariyiñci pāśupatāstraṁ cēbūni
śuṁbha niśuṁbhula dunumāḍi vaccindi śrīśyāmalagā ||
mahāmantrādhidēvatagā lalitātripurasundarigā
dāridrya bādhalu tōligiñci mahadānandamu kaligiñcē ||
artatrāṇaparāyaṇivē advaitāmr̥ta varṣiṇivē
ādiśaṅkarā pūjitavē aparṇādēvi rāvammā ||
viṣṇu pādamuna janiyiñci gaṅgāvatāramu ēttitivi
bhāgīrathuḍu ninu kōluva bhūlōkāniki vaccitivi ||
(lalitāmātā śaṁbhupriyā jagatiki mūlaṁ nīvammā
śrī bhuvanēśvari avatāraṁ jagamantaṭikī ādhāraṁ)
āśutōṣuni mēppiñci ardhaśarīraṁ dālcitivi
ādiprakr̥ti rūpiṇigā darśanamiccēnu jagadamba ||
dakṣuni iṇṭa janiyiñci satīdēviga cāliñci
aṣṭādaśa pīṭhēśvarigā darśanamiccēnu jagadamba ||
śaṅkhu cakramunu dhariyiñci rākṣasa saṁhāramunu cēsi
lōkarakṣaṇa cēsāvu bhaktula madilō nilicāvu ||
parābhaṭṭārika dēvatagā paramaśānta svarūpiṇiga
cirunavvulanu cindistū cēraku gaḍanu dharayiñcitivi ||
pañcadaśākṣari mantrādhitagā paramēśvara paramēśvaritō
pramathagaṇamulu kōluvuṇḍa kailāsambē pulakiñcē ||
surulu asurulu andarunu śirasunu vañci mrōkkaṅgā
māṇikyāla kāntulatō nī pādamulu mērisinavi ||
mūlādhāra cakramulō yōginulaku ādīśvariyai
aṅkuśāyudha dhāriṇigā bhāsillēnu śrī jagadamba ||
sarvadēvatala śaktulacē satya svarūpiṇi rūpōndi
śaṅkhanādamu cēsitivi siṁhavāhinigā vaccitivi ||
(lalitāmātā śaṁbhupriyā jagatiki mūlaṁ nīvammā
śrī bhuvanēśvari avatāraṁ jagamantaṭikī ādhāraṁ)
mahāmēruvu nilayanivi mandāra kusumamālalatō
munulandaru ninu kōlavaṅga mōkṣamārgamu cūpitivi ||
cidambarēśvari nī līla cidvilāsamē nī sr̥ṣṭi
cidrūpī paradēvatagā cirunavvulanu cindiñcē ||
ambā śāṁbhavi avatāraṁ amr̥tapānaṁ nī nāmaṁ
adbhutamainadi nī mahima atisundaramu nī rūpam ||
ammalaganna ammavugā muggurammalaku mūlamugā
jñānaprasūnā rāvammā jñānamunandarikivvammā ||
niṣṭatō ninnē kōlicēdamu nī pūjalanē cēsēdamu
kaṣṭamulannī kaḍatērci kanikaramutō mamu kāpāḍu ||
rākṣasa bādhalu paḍalēka dēvatalantā prārthimpa
abhayahastamu cūpitivi avatāramulu dālcitivi ||
aruṇāruṇapu kāntulalō agni varṇapu jvālalalō
asurulanandari dunumāḍi aparājitavai vaccitivi ||
girirājuniki putrikagā nandananduni sōdarigā
bhūlōkāniki vaccitivi bhaktula kōrkēlu tīrcitivi ||
(lalitāmātā śaṁbhupriyā jagatiki mūlaṁ nīvammā
śrī bhuvanēśvari avatāraṁ jagamantaṭikī ādhāraṁ)
paramēśvaruniki priyasatigā jagamantaṭikī mātavugā
andari sēvalu andukōni antaṭa nīvē niṇḍitivi ||
karuṇiñcammā lalitammā kāpāḍammā durgammā
dariśanamiyyaga rāvammā bhaktula kaṣṭaṁ tīrcammā ||
ē vidhamugā ninu kōlicinanu ē pēruna ninu pilicinanu
mātr̥hr̥dayavai dayacūpu karuṇāmūrtiga kāpāḍu ||
mallēlu mōllalu tēccitimi manasunu nīkē iccitimi
maguvalamantā cēritimi nī pārāyaṇa cēsitimi ||
trimātr̥rūpā lalitammā sr̥ṣṭi sthiti layakāriṇivi
nī nāmamulu ēnnēnnō lēkkiñcuṭa mā taramavunā ||
āśritulandaru rāraṇḍi ammarūpamu cūḍaṇḍi
ammaku nīrājanamicci amma dīvēna pōndudamu ||
sadācāra sampannavugā sāmagāna priyalōlinivi
sadāśiva kuṭumbinivi saubhāgyamiccē dēvatavu ||
maṅgalagaurī rūpamunu manasula niṇḍā nimpaṇḍi
mahādēviki manamantā maṅgala hāratuliddāmu ||
(lalitāmātā śaṁbhupriyā jagatiki mūlaṁ nīvammā
śrī bhuvanēśvari avatāraṁ jagamantaṭikī ādhāraṁ)
Read more :
Sai Chalisa | Shirdi Sai Baba Chalisa